సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకునే సూచనలు నేడు, బుధవారం స్వష్టం అయ్యింది. ఒక వైపు అమెరికా సైన్యం ఇరాన్ ను మోహరిస్తున్నప్పటికీ అక్కడ సుదీర్ఘ కాలం యుద్ధం చెయ్యవలసి ఉంటుంది. ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని ఒక అంచనాకు వచ్చి భయపడుతున్నారు. అందుకే యూరో దేశాలు తమ సైన్యాన్ని పంపడానికి సిద్ధంగా లేవు. ఇజ్రాయిల్ కోసం ఎందుకు ఇంత మంది సైన్యాన్ని బలి పెట్టాలి అనే భావంతో ఇరాన్‌తో శాంతి చర్చలకు ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ మాటలను విశ్వసించని ఇరాన్ యుద్దానికి సై అంటుంది. అయితే తాజాగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఫోన్‌లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై దాడులను ఇరాన్ ఆపాలని సూచించారు. దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని, హోర్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని పేర్కొన్నారుఈ సందర్భంగా యుద్ధం ముగింపు గురించి ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. యుద్ధం ముగించాలంటే తమకు కొన్ని బలమైన హామీలు కావాలని పెజెష్కియాన్ డిమాండ్ చేసారు.. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కావనే హామీ యూరో దేశాలు ఇస్తే ఇస్తే, ఇరాన్ కు నష్ట పరిహారం చెల్లిస్తే యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే అమెరికాతో తాము ఎలాంటి అధికారిక చర్చలూ జరపడం లేదని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *