సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమం కింద చేనేత, పవర్‌ లూమ్‌ రంగాలకు చేయూత నిచ్చేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకం నేటి బుధవారం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. చిన్న స్ధాయి నేతన్నల కుటుంబాలు ఎక్కువ నివసించే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో910 చేనేత పవర్‌లూమ్స్‌ కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. పాలకొల్లు నియోజకవర్గంలో 366 చేనేత కుటుంబాలకు అధిక సంఖ్యలో ప్రయోజనం కలుగుతుండగా, ఆచంట, భీమవరం, తణుకు, నర్సాపురం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో 405 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ పథకం ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం కింద పవర్‌లూమ్‌కు చెందిన శ్రామికులకు 500 యూనిట్లు, చేనేత శ్రామికులకు 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగం వరకు ఉచితమే. ఈ పవర్‌లూమ్‌ కలిగిన ఒక్కో కుటుంబానికి నెలకు ప్రభుత్వ అంచనా ప్రకారం రూ. రెండు వేల నుంచి రూ. 2200 వరకు, హ్యాండ్‌లూమ్‌ కుటుంబానికి నెలకు రూ. 700 నుంచి రూ.800 వరకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుంది. విద్యుత్‌ వ్యయం తగ్గడంతో చేనేత పారిశ్రామికులకు ఊరటనిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *