సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఆమోదం తరువాత వైసీపీ సబ్యులకు బలం ఉన్న ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టకుండానే కూటమి సర్కార్ ముందడుగు వేసింది. .. నేడు, బుధవారం అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్‌సభ లో కూటమి సర్కార్ ప్రవేశపెట్టగా ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. అయితే అమరావతిరాజధానికి తాము వ్యతిరేకం కాదని అయితే బిల్లు లో పలు అంశాలు మార్చాలని పట్టు బట్టిన వైసీపీ ఎంపీలు సభ నుండి బయటకు వెళ్లిపోయారు.అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. ఎంపీ అప్పలనాయుడు లోక్‌సభలో ఎంపీ మాట్లాడుతూ.. అమరావతి రైతుల త్యాగం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. . భావితరాల భవిష్యత్తు కోసం రైతులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి సుమారు 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు వైసీపీ సభ్యులు వాక్‌అవుట్ చేయడం ఏపీ రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను అవమానించినట్లే అని ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు రేపు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది.
