సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ఫై నేడు, గురువారం రాజ్యసభలో చర్చ జరుగుతున్నా నేపథ్యంలో .. కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి మాట్లాడుతూ..అమరావతి రాజధాని ఔను! కమ్మ రాజధానిఅని పిలిచిన అభ్యన్తరం లేదని ఆసక్తికర వ్యాఖ్య చేసారు. ఇది కొందరు సబ్యులకు ఇబ్బంది గా మారింది.ఇక లోక్‌సభలో వ్యతిరేకించిన విధంగానే రాజ్యసభలోనూ ఈ బిల్లును వైసీపీ ఎంపీలు అభ్యన్తరాలు చెపుతూ సభ నుండి వాకౌట్ చేసారు. నేటి సభలో చర్చలో భాగంగావైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అమరావతి కి ఉన్న ఆసక్తి కేంద్రంలో ఎన్డీయే ఇచ్చిన హామీ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బిల్లులో లేదన్నారు. నిజానికి ఈ 7 ఏళ్ళ చంద్రబాబు పాలనలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమైనా జరగలేదని తెలిపారు. వేలకొలది ఎకరాల భూములు ఇచ్చిన రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో? స్పష్టత లేదన్నారు. రాజధాని పేరుతొ వేలకోట్ల రూపాయలు దోచేయడం తప్ప.. అసలు రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని, దానికి చట్టబద్దత కల్పించడం ఏమిటని ? ఎంపీ ప్రశ్నించారు.మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరు పట్టణాలు కలుపుతూ రాజధాని చెయ్యాలన్న’మావిగన్‘ ప్రతిపాదన పరిశీలించాలని అన్నారు. అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజధాని అమరావతి మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అంటున్నారని తెలిపారు.రెండేళ్లలోనే రూ.3.40 లక్షల కోట్ల అప్పు చేశారని.. ఇలాగే కొనసాగితే రూ.14 లక్షల కోట్లకు అప్పు చేరుతుందనిరాష్ట్ర ప్రజలకు పెను భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసారు వైవీ సుబ్బారెడ్డి.
