సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్థాపితమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కె కన్వెన్షన్‌లో ‘వైభవ భారతం’ పేరుతో విశిష్ట వ్యక్తుల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు మరియు దేశభక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ విజయాదిత్య మాట్లాడుతూ ..RSS శతాబ్ది పూర్తి చేసుకుంటున్న వేళ సమాజంలో విప్లవాత్మక మార్పులు రావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ‘పంచ పరివర్తన్’ ఆవశ్యకతను ఆయన తెలియచెప్పారు. కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంతో పాటు భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ మంతెన రామచంద్ర రాజు, విభాగ్ కార్యవాహ వీరభద్ర రాజు ముఖ్య అతిథులుగా పాల్గొనగా ఈ సమ్మేళనంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *