సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ , కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలసి,ఎన్డీయే ఎంపీలతో నేడు, సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్, ఎంపీలతో ముచ్చటించారు ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో ఇంటెలిజెంట్, విజనరీ లీడర్ అంటూ మెచ్చుకున్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం నిజంగా హర్షణీయమన్నారు . కాగా, రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం గత ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *