సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వీరమ్మ పార్క్ వద్ద గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు, సోమవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. గత 20 ఏళ్లుగా గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, అసోసియేషన్ సభ్యులను అభినందించారు. వాకర్స్ గౌరవాధ్యక్షులు ఇల్లా రాధా, అధ్యక్ష, కార్యదర్శులు పడాల వాసు, కె ఆనంద్ మాట్లాడుతూ ..మజ్జిగ చలివేంద్రాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని, 75 రోజులపాటు ఈ చలివేంద్రం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, రామాయణం చిన్నారి, కూటమి నేతలు గంటా త్రిమూర్తులు, షబీనా బేగం, గని రెడ్డి త్రినాథ్, దారపురెడ్డి త్రివిక్రమ్, మాజీ కౌన్సిలర్లు ఎండి నౌషాద్, మాగాపు ప్రసాద్, సూరిబాబు, కె నరేంద్ర, అరవ నాగేశ్వరరావు, రావూరి అనంత్, మాగాపు భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
