సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఉత్తరాది వారుదేశ రాజకీయాలలో చక్రం తిప్పుతూ దక్షిణాది వారిని పన్నులు వేసి ఆర్ధికంగా దోచుకొంటూ ఆ డబ్బు తో ఉత్తరాదిలో వారి స్వంత రాష్ట్రాలను అభివృద్ధి చేసుకొంటున్న తీరుపై పలువురు ఆర్ధిక పెద్దలు, విశ్లేషకులు గళం విప్పుతుంటే .. పనిలో పనిగా సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj).ఇదే అదనుగా హిందువత్వంపై తన అక్కసును మరోసారి బయట పెట్టుకొంటూ దక్షిణాది, ఉత్తరాది వివాదంలోకి శ్రీ రామ చంద్రుని లాగుతూ అనుచిత పోస్టులు పెట్టి దేశ వ్యాప్తం గా సంచలనమ్ రేపారు. ఇటీవల కేరళలో జరిగిన ఓసాహిత్యోత్సవంలో ప్రకాశ్‌రాజ్ రామాయణం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంటూ .. వారు దక్షిణాది వాడయిన రావణుని అడవిలో ప్రవేశించి పళ్ళు తిన్నారని, అక్కడ ఉన్న రావణుడు పోనిలే ఆకలితో ఉన్నారు అని వారిని వదిలేస్తే.. రాముడు లక్ష్మణునితో రావణుడిని ట్రైబల్ అని సంబోదించి గొడవ పెట్టుకున్నాడని ప్రకాశ్‌రాజ్ వంగ్యంగా కధ చెప్పడం చూసి నెటిజన్లు మండి పడుతున్నారు. ఉత్తర దక్షిణాది మధ్య జరుగురుతున్న వాస్తవ తేడాలు వాస్తవ దృష్టితో విశ్లేషిస్తే ప్రజల అర్ధం చేసుకొంటారు కానీ. పవిత్ర రామాయణ ఇతిహాసాన్ని కించపరుస్తూ ఇలా హిందూ మత ద్వేషి గా ప్రవర్తించడం మంచిది కాదని, ఇలాంటి నోటి దురద ..కామెంట్స్ ఇతర మతాలపై వెయ్యగలడా? పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు.
