సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వ్యతిరేకించినందుకు నిరసనగా నేడు, శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలులో ఎన్డీఏ కూటమి పక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు రోడ్లపై నడుస్తూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చెసారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే కాంగ్రెస్ అడ్డుపడిందని, ఈ పోరాటానికి దేశవ్యాప్త తోలి నిరసన నిడదవోలు నుంచి మొదలైందని తెలిపారు.తన నిడదవోలు పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని
వైసీపీ అధినేత
వైఎస్ జగన్ హయాంలో అన్న క్యాంటీన్లు మూసేసి, పేదలకు అన్నం లేకుండా చేశారనిఏపీలో గొడ్డలి పార్టీ ఉందని.. పేదల సమస్యలు పట్టవని ధ్వజమెత్తారు. పేదలకు అభివృద్ధి, కడుపునిండా అన్నం పెట్టడానికి జగన్ అండ్ కోకు మనసొప్పదనివిమర్శించారు. నేను అధికారంలోకి వచ్చాకే ప్రజలకు సూపర్ సిక్స్ పధకాలు అమలుతో తో ఆదుకొన్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *