సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జపాన్ లో నేడు సోమవారం మరోమారు అతి శక్తివంతమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదు చేసింది. ఉత్తర జపాన్ తీరానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో భూమికి సుమారు 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. రాకాసి అలలు తీర ప్రాంతాన్ని ముచ్చెంతే ప్రమాదముందని ప్రజలు ఎత్తిన ప్రదేశాలకు ప్రజలు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు భూకం పనలు వచ్చిన ప్రాంతంలో అణు విద్యుత్కేంద్రాలు ఉండటంతో స్థానిక ప్రజల్లో ఒక్కసారిగా భయాందోళనలు మెుదలయ్యాయి. ఇదిలా ఉండగా జపాన్ లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో భారత్ లోనూ ఒక్కసారిగా ఆందోళనలు మెుదలయ్యాయి. అయితే వారి భయాల్లో ఎలాంటి లాజిక్ లేదని, హిందూ మహాసముద్రం ఫై దీని ప్రభావం ఉండదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *