సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నేడు సోమవారం 76వ జన్మదినం సందర్భంగా ఉదయం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు సీఎం చంద్రబాబుకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.సీఎం చంద్రబాబు జన్మదినం వేళ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే ఏపీ సీఎం.. తన మంచి మిత్రుడుగా పేర్కొన్నారు. ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరియు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సైతం ఎక్స్ వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ప్రస్తుతం సీఎం చంద్రబాబు తమిళనాడు లోని కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
