సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నేడు, బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు. ఆయన 90 సంవత్సరాలు పైగా జీవించారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్‌రావు జన్మించారు.1978లో విజయవాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు భాస్కర్‌రావు.1984 ఆగష్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం 31 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా నాదెండ్ల పదవీ బాధ్యతలు చేపట్టారు. తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాదెండ్ల 1989లో తెనాలి నుంచి పోటీ చేసి అన్నాబత్తుని సత్యనారాయణపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి భాస్కర్ రావు గెలుపొందారు. ఈయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు మృతిపట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
