సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతము యుద్ధం నిలిచిపోయినప్పటికీ ఇరాన్ బయట దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసుకోకుండా ముడి చమురు ఎగుమతి చేసి ఆదాయం పొందకుండా తన ఓడరేవులను అమెరికా నౌకలు దిగ్బంధించటంతో ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్‌.. దిగ్బంధనాన్ని వెంటనే ఆపకపోతే పర్షియన్‌ గల్ఫ్‌లోని సముద్ర గర్భ ఇంటర్నెట్‌ కేబుళ్లను ధ్వంసం చేస్తామని తాజగా ఇరాన్ కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్స్ప్‌ (ఐఆర్‌జీసీ) ఓ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో గత ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన తర్వాత సముద్ర గర్భ ఇంటర్నెట్‌ కేబుళ్లను లక్ష్యంగా దాడి చేస్తామని ఇరాన్‌ ప్రకటించటం ఇదే తొలిసారి. ఈ కేబుళ్లు ధ్వంసమైతే గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్ లలో ఇంటర్ నెట్ నిలిచిపోయి మొత్తం ఆర్థిక వ్యవస్థలు చాల కాలం స్తంభించిపోతాయి. భారత్ ఫై కూడా కొంత ప్రభావం ఉంటుంది. కాగా, ఏ క్షణంలోనైనా అమెరికా దాడులతో దొంగ దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉంటుందని ‘ఇరాన్‌పై దాడులు చేసేందుకు మా పొరుగున ఉన్న దేశాలు అమెరికాకు తమ భూ భాగాలను వాడుకొనేందుకు అవకాశం ఇస్తే.. ఆయా దేశాలు వారి చమురు ఉత్పత్తిని శాశ్వతంగా వదిలేసుకోవాల్సి వస్తుంది’ అని ఇరాన్ వైమానిక అధిపతి జనరల్‌ మాజిద్‌ మౌసవీ హెచ్చరించారు. ఏది ఏమైనా ఇరాన్ వైఖరి భారత్ ముడి చమురు నౌకలకు కూడా ఇబ్బందిగా మారింది.( పైన ఊహాజనిత చిత్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *