సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో కీలకమైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు, గురువారం ఉదయం 7 గంటలకు మెుదలైంది. ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకొంటున్నారని తాజగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ , మమతా బెనర్జీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మెుత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి దశలో భాగంగా 152 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెుత్తం 7.04 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఈ దశలో 3,60,77,310 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు, కాంగ్రెస్ మద్దతుతో డి ఎం కే పార్టీ, స్టాలిన్ అధికారంలో ఉన్న తమిళనాడులో ఒకే విడతలో మెుత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో మెుత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 5.73 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్ల కోసం మెుత్తం 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెద్దఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. కాగా, మే 4న రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి
