సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు ఫలితాలు ఈనెల ఆఖరు వారంలో వస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులందరూ ఫలితాలు ఫై టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ ఏప్రిల్ 15 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, మే 2న ఫలితాలను విడుదల చేసే అవకాశముంది. ఈసారి మార్కుల లెక్కింపులో పొరపాట్లు నివారించేందుకు ప్రభుత్వం ట్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, హాజరు శాతం సుమారు 99.5% గా నమోదైంది. .ఫలితాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ను సందర్శించవచ్చు. అదేవిధంగా 9552300009 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *