సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ MLA నవీన్ కుమార్ యాదవ్ భీమవరం పట్టణంలో పలు దేవాలయాలను సందర్శించి ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు చేసారు. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని, మరియు పంచారామ క్షేత్రం లోని శ్రీ సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి హోసింగ్ బోర్డు కాలనీ లో శ్రీ వెంకట సాయి బాబా వారి వార్షికోత్సవాలు ముగింపు కార్యక్రమంలో నిర్వాహకులు మళ్ళినీడి బాబీతో కలసి సాయి బాబా వారికీ ప్రత్యేక పూజలు అనంతం జరిగిన అఖండ అన్న సమారాధన ప్రారంభించారు. మందిర అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. భీమవరం రావడం ఇక్కడ ఇంత మంది మిత్రుల సహకారంతో పవిత్ర దేవాలయాలను దర్శించుకోవడం మీ ఆతిధ్యం పొందటం ఆనందంగా ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *