సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంతకీ ముగింపుకు రాని అమెరికా-ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్ వరుసగా 3వ రోజు భారీ నష్టాలను చవి చూస్తుంది.ముడి చమురు ధరలు,మరింత పెరుగుతాయన్న భయాల నడుమ ఇన్వెస్టర్లు తమఐటీ రంగంలో షేర్స్ ను ఎక్కువగా అమ్మకాలకు పెడుతున్నారు. నేటి శుక్రవారం . ఉదయం ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తరువాత మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లపైగా పతనం కాగా, నిఫ్టీ కూడా 285 పాయింట్ల మేర కోల్పోయింది. సెన్సెక్స్ 76,768 వద్ద, నిఫ్టీ 23,890 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50లోఇన్ఫోసిస్ షేర్ 5.2 శాతం మేర పతనం కాగా, హెచ్‌సీఎల్, టీసీఎస్, విప్రో షేర్లు కూడా 4 శాతానికి పైగానే పతనం అయ్యాయి. బ్యాంకింగ్ రంగంలో షేర్స్ మాత్రం నెమ్మదిగా పతనం అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *