సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ముక్కుకు సంబందించిన ఆపరేషన్ చేయించుకొని కోలుకొంటున్నారు. అయితే నేడు, శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా డిప్యూటీ సీఎం స్పందించారు. .. ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థ నూతన దిశగా స్వయం ప్రతిపత్తితో ముందుకు వెళ్తోందని పవన్ అన్నారు. తన హయాంలో గ్రామ సభలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఎమ్‌జీఎన్‌ఆర్ఈజీఎస్ (MGNREGS) సమన్వయంతో గ్రామ సభలు, పల్లె పండుగ 1.0 & 2.0 విజయవంతం అయ్యాయని అన్నారు. స్వచ్ఛ రథాలు, ఎస్‌ఎల్‌ఆర్‌ఎమ్(SLRM) కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రైన్స్ సాధించామని అన్నారు.. ఈ గ్రామ స్వరాజ్యం యాత్రలో భాగస్వాములైన ప్రజలకు, సర్పంచ్‌లకు, వార్డ్ సభ్యులకు, ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *