సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన భారత్ ను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే పలుమారులు తన మాట దురుసుతో తీవ్ర స్థాయిలో అవమాన పరిచారు.పాకిస్తాన్ ఫై ఆపరేషన్ సిందూర్ ను భారత్ తన హెచ్చరికలతో నిలిపివేసిందని ఇప్పటికి ప్రపంచానికి పలుమారులు చాటి చెపుతూనే ఉన్నాడు.అమెరికా లో భారతీయ ఉద్యోగులను అవమానించడమే కాకుండా, అక్రమంగా వలస వచ్చారని ఎందరో భారతీయులను విమానాలలో సంకెళ్లు వేసి దొంగలుగా తీవ్ర అవమానకర పరిస్థితులలో భారత్ తిరిగి పంపించారు. భారత దేశం రష్యా ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు చేస్తే ఊరుకోనని అదుపులో పెట్టానన్నారు.. భారత మిత్ర దేశం ‘ఇరాన్ సుప్రీం‘ దాడిలో చనిపోతే కనీసం 5 రోజుల వరకు సంతాపం ప్రకటించలేని పరిస్థితి. అమెరికా ఇలా ఇటువంటి ఎన్నో తీవ్ర అవమానాలు చేసిన కూడా భారత ప్రభుత్వం సహిస్తూ పోతుంది. తప్ప తిరిగి విమర్శించే సాహసం చేయలేకపోతోంది. అయితే తాజగా .. ‘భారత్, చైనా’ తదితర దేశాలను నరకాలుగా.. ఆ దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారిని ‘గ్యాంగ్స్టర్స్ విత్ ల్యాప్‌టా్‌ప్స’గా అభివర్ణిస్తూ… అమెరికాకు వలస వచ్చిన భారతీయులు, చైనీయులు ఈ దేశానికి చేసిన నష్టం.. మాఫియా కుటుంబాలన్నీ కలిపి చేసిన నష్టంకన్నా ఎక్కువ అని అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు మైఖేల్ శావేజ్ చేసిన వీడియో పోస్టును డొనాల్డ్ ట్రంప్ తన’ట్రూత్ సోషల్’లో రీపోస్ట్ చేసి తన వక్ర బుద్ది మరోసారి చాటుకొన్నారు. దీనిపై భారత్ చాల తక్కువ స్వరంతో స్పందించింది. ఆ వ్యాఖ్యలు అనుచితమైనవి, వాటిని ట్రంప్ విజ్ఞతకే వదిలివేస్తున్నామని తేల్చింది.అయితే.. శావేజ్ పోస్టును ట్రంప్ రీపోస్ట్ చేయడాన్ని హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ ఖండించింది. భారత్ చైనాలు వందల ఏళ్లక్రితమే గొప్ప నాగరికతతో వెల్లివిరిశాయని, ట్రంప్ కి అంత జ్ఞానం ఉండదని ఇరాన్ దృష్టిలో మానవత్వం మచ్చుకైనా లేని ట్రంప్’ యుద్ద నేరగాడని అతడి వాఖ్యలు జాత్యహంకారానికి నిదర్శనమని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.(తాజా వార్త కధనాల ఆధారంగా..సిగ్మా ప్రసాద్ కాలమ్స్)
