సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని న్యాయస్థానాన్ని ఆ బాలిక తల్లి ఆశ్రయించిన నేపథ్యంలోభీమవరం డీఎస్పీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) నెడు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో హైకోర్టులో ఈరోజు జరిగిన విచారణలో .. లైంగిక దాడి తో బాధపడుతున్న బాలికకు పోలీసులు అండగా ఉండాలి కానీ,ఇలా చేస్తే ఎలా? బాలిక తల్లి ’ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు ?’ దేవుడు మీకేమైనా దివ్య దృష్టి ఇచ్చాడా? అని హైకోర్టు నిలదీసింది. రాజకీయ కారణాలా? లేక ఇతర కారణాలా అనేది సంబంధిత కోర్టు తేలుస్తుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.డీఎస్పీ వివరణ తమకు సంతృప్తికరంగా లేదని దీనికి సంబందించిన కేసు ఫై వాస్తవాలు సమీక్షా చేసే రికార్డులతో తమకు స్వయంగా రిపోర్ట్ చెయ్యాలని జిల్లా ఎస్పీ ఆడాన్ నయీమ్ హస్మి కి హైకోర్టు సూచించింది. ( తాజా వార్త కధనం ప్రకారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *