సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధం ఇప్పట్లో తేలేలా లేకపోవడంతో హర్ముజ్ సముద్ర జలాలలో భారతీయ షిప్లు లతో పాటు అన్ని దేశాల నౌకలను ఇరాన్ అమెరికాలు పోటాపోటీగా దిగ్బంధనం చెయ్యడంతో భారత్ ఫై ఈ ప్రభావం బాగా పడింది. సందెట్లో సడేమియా అంటూ బ్లాక్ మార్కెట్ వ్యాపారాలు రెచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో పెట్రోల్ కన్నా డీజిల్ భారీ కొరతతో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేత అంశంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandababu ) నేడు, శనివారం సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు, రైతుల ఇబ్బందులపై అధికారులతో సీఎం మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లాల కలెక్టర్లతో, పెట్రోల్ బంకు ల యాజమాన్యాలతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్‍ఫ్రీ నం.1967కు కాల్ చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సూచించారు. టోల్‍ఫ్రీకి ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *