సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: చిత్తూరు జిల్లా వి. కోట లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డి ని దుండుగులు అత్యంత పాశవికంగా నేటి మంగళవారం ఉదయం నరికి చంపిన ఉదంతంలో దీనివెనుక స్థానిక శ్రీ గంధం చెట్ల స్మగ్లర్లు హస్తం? ఉందని వార్తలు వస్తున్నాయి. జర్నలిస్ట్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం వాకింగ్ చేసే సమయంలో హత్యకు గురి అయ్యారు. ఈ నేపథ్యంలో హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా అందరు మీడియా సంఘాలు మీడియా ప్రతినిధులు ఈహత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భీమవరంలో మీడియా ప్రతినిధులు ప్రధాన రోడ్లపై ర్యాలీ నిర్వహించి రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డిహత్యపై తీవ్ర నిరసన తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుతం దుండగులను కఠినంగా శిక్షించాలని, మీడియా ప్రతినిధులకు రక్షణ కల్పించాలని కోరుతూ స్థానిక కార్యాలయంలో విన్నతి పత్రం అందజేశారు.
