సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పదో తరగతి విద్యార్థులు వారి తల్లి తండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 10 th పరీక్ష ఫలితాలు రేపు (ఏప్రిల్ 30) విడుదలకానున్నాయి. ఈమేరకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. ఎక్స్‌ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. రేపు, గురువారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి.. స్కూల్ లాగిన్ ద్వారా హెడ్ మాస్టర్లు నేరుగా మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను results.bse.ap.gov.in సైట్‌లో చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. అలాగే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009‌కు ‘హాయ్’ మెసేజ్ చేసి ఫలితాలను చూడవచ్చన్నారు. లీప్ యాప్ ద్వారా కూడా విద్యార్థులు తమ రిజల్ట్స్‌ను తెలుసుకోవచ్చని మంత్రి లోకేశ్ తెలిపారు. గత ఇంటర్ ఫలితాలు మాదిరిగానే ఈ ఫలితాలు కూడా రికార్డు సాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *