సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు నేతృత్వంలో శ్రీరామ భక్తులు ప్రతిష్టాకరంగా తీసుకొన్న ఆకివీడు పెదపేటలో రామాలయం పునర్ నిర్మాణం పై వేసిన పిల్‌ను ఏపీ హైకోర్టు(AP High Court) డిస్పోజ్ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే హైకోర్టులో మరో బెంచ్ ముందు రిట్ పిటిషన్‌తో పాటు కోర్టుధిక్కరణ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఈనేపథ్యంలో అదే బెంచ్ దగ్గర అక్కడే తేల్చుకోవాలని నేడు, బుధవారం హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ పిల్‌ను ముందుగా డిస్మిస్ చేస్తామని హైకోర్టు చెప్పగా.. పిల్ తరఫున హాజరైన న్యాయవాది శ్రవణ్ కుమార్ డిస్పోజ్ చేయాలని అభ్యర్థించారు. దీంతో పిల్‌ను డిస్పోజ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ధర్మాసనం ప్రకటించింది.
