సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు ఎక్కువ సంఖ్యలో రాజీ చేయడం ద్వారా మే నెల 9వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని” భీమవరంలో 3వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr.B. లక్ష్మీనారాయణ అన్నారు. కక్షిదారుల్లో లోక్ అదాలత్ రాజీల పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఎటువంటి ఇబ్బందులున్నా న్యాయమూర్తుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఎక్సైజు కేసుల్లో కాంపౌండ్ ఫీజు కట్టించి అవార్డు కాపీలను దాఖలు చేసుకొనే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో భీమవరం 1వ పట్టణ, 2వ పట్టణ, రూరల్, ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు, వీరవాసరం, భీమవరం ఎక్సైజు, ఆకివీడు ఎక్సైజు పోలీసు స్టేషన్ల సర్కిల్ ఇన్స్పక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కోర్టు కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.
