సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా అకస్మాత్తుగా నేడు, గురువారం ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్ ఓడ రేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండడంతో చమురు సరఫరాపై నిలచిపోయింది. గల్ఫ్ దేశాలలో యుద్ధం దెబ్బకు చాలామటుకు చమురు కేంద్రాలు దెబ్బ తిన్నాయి. దీనికి తోడు రష్యాలో కూడా ఉకెయిన్ డ్రోన్ దెబ్బలకు భారీ చమురు ఉత్పత్తి కేంద్రాలు దెబ్బ తింటున్నాయి. తాజగా ఉక్రెయిన్ డ్రోన్స్ ఉపయోగించి ఏకంగా తన సరిహద్దు నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో రష్యా ఆయిల్ పంపిణీ వ్యవస్థలో చాల భారీ చమురు కేంద్రాన్ని ద్వంసం చెయ్యడం చమురు ఉత్త్పత్తులపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో రష్యా ఆయిల్ రంగాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. తాజా పరిణామాలతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా ఆరు శాతం పెరిగి 120 డాలర్లు దాటింది.,మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే మన భారతీయ రూపాయి మరింతగా క్షీణించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.20గా ఉంది. రికార్డు కనిష్ఠానికి చేరుకుంది. ఈ ప్రతికూలతల నేపథ్యంలో స్టొక్ మార్కెట్ నేడు, గురువారం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. నేటి ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 816 పాయింట్ల నష్టంతో 76,680 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ ప్రస్తుతం 256 పాయింట్ల నష్టంతో 23,921 వద్ద కదలాడుతోంది. (Indian stock market).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *