సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:మెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య తాజగా దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణ చర్చల్లో భాగంగా ఇరాన్ సంక్షోభంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇరాన్‌పై భూతల దాడులు చేయడం ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ అమెరికా ఇలాంటి చర్యలకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ ను హెచ్చరించారు. ఇదే సమయంలో.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అవసరం అయితే అమెరికా కాకుండా తాము తీసుకునేందుకు రష్యా రెడీగా ఉందన్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము కూడా మధ్యవర్తిత్వం వహిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు చాలాకాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై చర్చల్లో సానుకూల సంకేతాలు వచ్చాయి. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ కోసం ట్రంప్ సూచనలను పుతిన్ స్వాగతించారని రష్యా విదేశీ సలహాదారు యురి ఉషకోవ్ తెలిపారు. పాకిస్తాన్ తన స్వప్రయోజనాల కోసం మధ్యవర్తితం పేరుతొ ఇరాన్ తోనూ అమెరికా తోనూ దొంగ డ్రామాలు ఆడుతుందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో… ట్రంప్ ఇక చేసేది లేక పుతిన్ ను ఆశ్రయించారు.. పుతిన్‌తో జరిగిన చర్చల వల్ల ట్రంప్ సైతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు రష్యా సాయం తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *