సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి వైద్యులు గా శతాబ్దాలుగా కమెర్షియల్ ఆలోచనలకూ దూరంగా అనేక ఎకరాలా భూమిలో అడవిని తలపించే వృక్ష జాతులను పెంచి వాటి నీడలోపకృతి వడిలో ఎన్నో వేల మందికి ఆరోగ్యం అందించిన మహానుభావులు భీమవరం ప్రకృతి ఆశ్రమం వ్యవస్థాపకులు నేచురోపతి డాక్టర్ వేగిరాజు గోపాలరాజుపెద్ద వయస్సు కారణంగా నేడు, శుక్రవారం ప్రకాశవంతమైన పౌర్ణమి రోజుమరణించిన నేపథ్యంలో.. పలువురు ఆయన తుది దర్శనం చేసుకొని నివాళ్లు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆశ్రమం డాక్టర్ గా సుప్రసిద్ధులు డాక్టర్ వేగిరాజు కృష్ణంరాజును పరామర్శించారు. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అక్కడ కు వచ్చి వేగిరాజు గోపాలరాజు వారి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. మన సిగ్మా న్యూస్ తరపున కూడా ఆయన కుటుంబ సబ్యులకు సంతాపం తెలియజేస్తున్నాము
