సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం పవిత్ర వైశాఖ మాసం పౌర్ణమి నేపథ్యంలో భీమవరం గునుపూడిలోని పవిత్ర పంచారామ క్షేత్రంలో సాక్షాత్తు చంద్ర ప్రతిష్టగా పురాణాలు పేర్కొన్న శ్రీ సోమేశ్వర స్వామి వారికి అత్యంత వైభవం గా మామిడిపండ్ల అలంకరణ ను నిర్వహించారు. పౌర్ణమి నేపథ్యంలో.. శ్వేతా వర్ణంలోకి మారిపోయిన శ్రీ సోమేశ్వరుడు పసుపు పచ్చని మామిడి పండ్ల అలంకారం తో మరింత సుందరంగా విశేషంగా హాజరు అయినా భక్తులకు దర్శనమిచ్చారు. ఫై తాజా చిత్రంలో శ్రీ సోమేశ్వరుని మనోహర రూపాన్ని వీక్షించండి.
