సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీ లోని వివేక్ విహార్ ప్రాంతంలో నేటి ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 9 అంతస్తుల భవనంలో ఒక పోర్షన్ లో ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చి మొత్తం ఇంటిని అలుముకున్నాయి. అక్కడున్న వారు బయటకు రాకముందే మంటలు వేగంగా వ్యాపించాయి.సమాచారం అందగానే ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ భవనంలోని 16 మందిని కాపాడగలిగారు. మంటలను ఆర్పేందుకు శ్రమించారు. 14 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది అక్కడికి చేరుకుని రెండు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
