సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న అంశం ఆకివీడు రామాలయం.’రఘురామ’. ముందు చెప్పిన ప్రకారమే నేడు, ఆదివారం ఉదయం 7.14 గంటలకు ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయాన్ని పునఃనిర్మాణం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమం ఏపీ అసెంబ్లీ ఉప సభపతి రఘురామా కృష్ణంరాజు దంపతులు చేతుల మీదుగా వేద పండితులు పెద్ద ఎత్తున రామ భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అయితే ‘కూటమి పార్టీలోని కీలక నేతలు’ ఎవ్వరు ఈ కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. ఒకపక్క పలు కుల మత సంఘాలు నుండి తీవ్ర వ్యతిరేకతలు ,ముట్టడికి పిలుపులు, కోర్టులలో కేసులు మధ్య ‘జై శ్రీరామ్ ‘అంటూ రఘురామా ముందుకు వెళుతున్నారు. ఇక తదుపరి గుడి నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా శ్రీ రామ భక్తుల అండ ఉండాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తల మధ్య జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 3 రోజులుగా సుమారు 600 మంది పోలీసులతో గస్తీ నిర్వహిస్తున్నారు. వీరిలో ఎస్పీతోపాటు ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 20 మందిసీఐ లు, 80 మంది ఎస్సైలు, సుమారు 500 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆకివీడు లో 144 సెక్షన్‌ అమలులో ఉంది. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *