సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), త్రిష జంటగా బింబిసార పేమ్ వశిష్ఠ (Vassishta) దర్శకత్వంలో గత 3 ఏళ్లుగా సుదీర్ఘ కాలంగా తెరకెక్కుతోన్న విశ్వంభర (Vishwambhara) సినిమా రిలీజ్ కి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. అయితే చిరు అభిమానులకు శుభవార్త! జూలై 10 న విశ్వంభర రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్లో రావాల్సిన పెద్ది జూన్ 25 కి షిఫ్ట్ అయితే.. రెండు వారాల్లో తండ్రీకొడుకుల సినిమాలు రిలీజ్ కావడం కష్టమని.. విశ్వంభరకు లైన్ క్లియర్ అయ్యినట్లే అని చెప్పొచ్చు. ఎలాగూ జూన్ 26 న లెనిన్ కూడా వచ్చేస్తోంది. జూలై 10 కి చిరుకు పెద్దగా పోటీ లేకుండా పోయింది. అయితే విఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది.. అందుకే ఈ డేట్ కూడా అనుమానమే అని ఫిల్మ్ నగర టాక్. చూద్దాం..
