సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ప్రచార సైలిని , ‘సిద్ధం’ సభల తరహా సభలను , బాడీ లాంగ్వేజ్, ఖాకి ప్యాంట్, తెల్ల చొక్కా ధరించడమే కాదు.. ‘సింహం సింగిల్ గా ఏ పార్టీతో పొత్తు లేకుండా బరిలోకి దిగుతుందని’ డేర్ గా ప్రకటించి వైసీపీ తరహాలోనే తదితర అనుకరణలు చేసిన సినీ నటుడు విజయ్ ఆఖరికి అక్కడ ప్రచారంలో కూడా వాలంటీర్లు తో గ్రామా సచివాల వ్యవస్థ ఏర్పాటు చేస్తానని హామీలు ఇస్తూ..‘జగన్ తో తాను దిగిన ఫోటో’ పబ్లిక్ గా తెలుగు ప్రాంతాల పర్యటనలో ప్రదర్శించారు. ఇటీవల చెన్నయి లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో జగన్ తో కలసి ఆత్మీయంగా కులాసాగా కబురులు చెప్పారు. ఈ వీడియోలు, పోస్టర్స్ తమినాడులో ఒక పూహ్యం ప్రకారం బాగా వైరల్ చేసారు.. అక్కడ జగన్ ను అభిమానించే తెలుగు వారి ఓట్లు, ఒక వర్గం వారి ఓట్లు కూడా విజయ్ టార్గెట్ చేసారు. తమిళనాడు లోని 26 తెలుగు ప్రజల నియోజక వర్గాలలో సినీ హీరో విజయ్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇదిలా ఉండగా తాజగా విజయ్ పార్టీ గెలుపుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.. జగన్ తన ట్వీట్లో ..’నా ప్రియమైన సోదరుడు విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం అద్భుతం. ప్రజా సేవ చేసేందుకు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా.. మీకు అవసరమైన బలం, విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.. దేవుడు మీకు తోడుగా ఉంటారు’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు.. అదే సందర్భంలో దీదీకి నా సానుభూతిని ప్రకటిస్తున్నానన్నారు అన్నారు జగన్..
