సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ప్రతిష్టాకరమైన స్దానిక దంతులూరి నారాయణరాజు కళాశాలలో నేడు, సోమవారం డిగ్రీ 6వ సెమిష్టర్ ఫలితాలను ఉదయం 11:30 కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు విడుదల చేసారు. ఈ రోజు విడుదల చేసిన డిగ్రీ 6 వ సెమిస్టర్ ఫరీక్ష ఫలితాలలలో బి.ఎ 100 శాతం, బి.కాం(జనరల్) 100 శాతం, బి.కాం(కంప్యూటర్స్) 100 శాతం, బి.యస్.సి 100 శాతం సాదించాగా , అన్ని సెమిస్టర్ లో ఉత్తీర్ణత బి.కాం కంప్యూటర్స్ 79 శాతం, బి.కాం జనరల్ 75 శాతం, బి.యస్.సి 78 శాతం, బి.ఎ 74 శాతం ఉత్తీర్ణత సాదించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టి నేటి టెక్నాలజీకి అనుగుణంగా లాభాపేక్ష లేకుండా విద్యార్దులను తర్పీదు ఇస్తున్నామని అన్నారు. తమ కళాశాలలో చదివిన ప్రతీ విద్యార్దికి ఉద్యోగ సాదనకు కావలిసిన అన్ని రకాల సదుపాయాలను తమ కళాశాల యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా కల్పింస్తుందన్నారు. అదే విధంగా ఈ విద్యాసంవత్సరం నుండి బి.యస్.సి నర్పింగ్ కళాళాలను కూడా ప్రారంబిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *