సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో విచిత్ర వాతావరణం నెలకొంది.. కోనసీమలో వర్షాలు దంచి కొడుతుండగా ప్రక్కనే ఉన్న గోదావరి జిల్లాలలో ఎండలు మండిపోతున్నాయి. గతంతో పోలిస్తే సాయంత్రాలు కాస్త చల్లబడుతూన్నాయి. అయితే ఉక్కపోత మాములే ఇదిలా ఉండగా ఉపరితల ద్రోణి నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేశారు. అదేవిధంగా, తిరుపతి, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. గత సోమవారం కోనసీమ, ప్రకాశం, పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితిని గమనిస్తూ రైతులు పంటలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
