సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శనివారం కొత్త బస్టాండ్ లో ఉదయం 9న్నర సమయంలో ఒక దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. తణుకు వెళ్లవలసిన బస్సు స్టాప్ కు ముందే కొందరు ప్రయాణికులను ఎక్కించుకొని తదుపరి స్టాప్ వద్దకు వెళ్లి దూకుడుగా ప్లాట్ పారం ను గుద్దుకోని పైకి ఎక్కేయడంతో అప్పటికే బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఒక మహిళకు పళ్ళు ఊడిపోవడంతో పాటు 5గురు ప్రయాణికులకు రక్తం కారుతూ తీవ్రగాయాలు కావడంతో వారిని RTC సిబ్బంది అంబులెన్సు లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ప్రయాణికులతో ఒకరు సిగ్మా న్యూస్ కు ఫోన్ చేసి తెలిపారు. బస్సు డ్రైవర్ ఈ ఘటనపై బ్రేక్ ఫెయిల్ అయ్యిందని తాను ఊహించలేదని చెప్పడం గమనార్హం.. దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయి. అదృష్టవ శాత్తు అక్కడ తణుకు బస్సు కోసం వేచిచూస్తున్న ప్రయాణికులకు గాయాలు కాలేదు. వారు తప్పించుకొన్నారు. ఆ బస్సు ను అక్కడే నిలిపివేసి డిపోకు తరలించారు. ( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *