సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నుండి 11 కిమీ దూరంలో ఉన్న కాళ్ళకూరు గ్రామం లో 450 ఏళ్ళ క్రితం ‘స్వయం భువుడు’గా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ముగింపు నేపథ్యంలో నేడు, శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తిపోయారు. సుమారు 15వేల మంది భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి శ్రీ స్వామివారిని దర్శించుకొన్నారు. దేవాలయం ఆవరణలో రోడ్లు ప్రక్కన దూరప్రాంతాల నుండి వచ్చిన .వందలాది వాహనాల రద్దీ కనపడింది. గత ఏప్రిల్ నెల 25 న ప్రారంభమయిన శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలు వైభవంగా ముగిసిన నేపథ్యంలో స్థానిక దాతల సహకారంతో . నేడు,మే 9వ తేదీన శనివారం నేపథ్యంలో కాళ్ళకూరు గ్రామంలో దేవాలయం సమీపంలో అనేక ఎకరాల స్థలంలో ఏర్పటు చేసిన టెంట్లలలో పంచ బక్ష పరమాన్నాలతో భారీ స్థాయిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి ప్రారంభించారు. ప్రశాంత వాతావరణంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి మోకా అరుణ్‌కుమార్, ధర్మ కర్తల మండలి సభ్యులు, చైర్మెన్, ఏర్పాట్లను పర్యవేక్షించారు.
