సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం నాగిడిపాలెం గ్రామంలో ఓఎన్ జిసి సిఎస్ఆర్ నిధులు ద్వారా గివింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ11 లక్షలతో ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్స్, వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ ను నేడు, ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఓఎన్ జీసి సిఎస్ఆర్ నిధులతో గివింగ్ హాండ్స్ ఫౌండేషన్ మైక్రో ఫిల్టర్స్, వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ ను అందించటం చాలా సంతోషకరమన్నారు. ఓఎన్ జీసి గ్రామంలో సిమెంట్ రోడ్లు, గ్రామం అభివృద్ధికి కావలసిన పనులు చేసి గ్రామానికి ఉపయోగపడుతున్నారని వారిని అభినందించారు. ఓఎన్జిసి ఇన్సులేషన్ మేనేజర్ ఎస్ విఆర్ శివకుమార్, చరణ్, గివింగ్ హాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ డా బత్తుల కిరణ్ బాబు, సురేంద్ర, లోవరాజు లను సత్కరించారు. కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
