సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క డీజిల్ ధరలు పెరగటంతో రవాణా చార్జీలు పెరగటం పాటు ప్రచండ ఎండలకు పశ్చిమ గోదావరి జిల్లాలో మా ర్కెట్లో కూరగాయల ధరలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. గ్రామాలలో సైతం ఉద్యానవన పంటల కూడా దిగుబడి తగ్గి మార్కెట్‌కు సరుకు రావడం లేదు. రిటైల్ మార్కెట్ లో ఒక కేజీ చప్పున చూసుకొంటే అల్లం రూ.80 నుంచి ఒక్కసారిగా 150వరకు పెరిగిపోయింది. నిమ్మకాయలు 60 నుండి 120 రూపాయలకు చేరుకొన్నాయి.నాణ్యమైన వెల్లులి ధర ఒక్కసారిగా 150 నుండి 260 రూపాయలకు చేరుకొంది. ఉల్లి పాయల ధరలు 20 నుండి 30 రూపాయలకు ఎగబాకాయి. ఇక పెన్నాడ వంకాయలు దొరకటడమే కష్టంగా మారితే ఇక బయటి వంకాయలు రకం బట్టి కిలో రూ.60 నుంచి 80కు పెరిగిపోయాయి. బీరకాయలు రూ.40 నుంచి 60, బెండ రూ.60, దొండ రూ.30, కాకర రూ.60, క్యాప్సికం రూ.60, కీర రూ.50, బీట్‌రూట్‌ రూ.50, క్యారెట్‌ రూ.60, టమాటా రూ 50, మిర్చి రూ.60, అరటి కాయ జత రూ.25కు విక్రయిస్తున్నారు.ఊహించని రీతిలో గుడ్డిలో మెల్ల లా మొన్నటి వరకు 20 రూ వరకు అమ్మిన ములగ కాయ కాపు పెరగటంతో రూ.5కు చప్పున అమ్ముతున్నారు. పచ్చి మామిడి ధర కూడా దిగివచ్చి క్వాలిటీ బట్టి కేజీ 30 రూపాయలు నుండి అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *