సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ 17 ఏళ్ళ అమ్మాయిని లైంగిక దాడి చేసాడని ఇటీవల నమోదు అయిన పోక్స్కో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిన్న ప్రధాని మోడీ పర్యటనలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటున్న నేపథ్యంలో ఈ కేసు విషయం పెద్దగా చర్చించకపోయినప్పటికి ,, నేడు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుపైన తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు. మే 8న ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసు వివరాలను సీఎంకు డీజీపీ వివరించారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని డీజీపీ ఆనంద్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు భగీరథ్‌పై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయనట్లు తెలుస్తోంది.ఇక ఈ కేసులో వేగం పెరగనుంది.. అయితే కేసు నమోదు చేసిన బాధిత బాలిక తల్లి తండ్రులు ఒక పధకం ప్రకారం తమను ఈ కేసులో ఇరికించారని బండి భగిరద్ కుటుంబీకులు కూడా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు.
