సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం నుండి మరల చల్లని కబురు వచ్చింది. అటు ఉపరితల ద్రోణి, కి తోడుగా ఇటు . నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గోదావరి జిల్లాలు తీరప్రాంతాలలో గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.నేటి సోమవరం సాయంత్రం నుండి భీమవరం తో పాటు జిల్లా వ్యాప్తంగా చల్లని గాలులు విస్తృతంగా వీస్తున్నాయి. తెలంగాణలో నేడు సోమవారం నుండి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో కొద్దిరోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో వచ్చే గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
