సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశ ప్రజలు ఎంత తెలివైనవారో ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తరువాత’ ప్రజాస్వామ్యదేశ’ వ్యాప్త పరిణామాలు చెబుతున్నాయి. ఉత్తరాదిన ఈశాన్య రాష్ట్రాలలో అతి కీలక మైన అతి పెద్దది అయిన పశ్చిమ బెంగాల్ ను బీజేపీ గెలుచుకోవడంతో ప్రస్తుత ‘బంగాళాదేశ్’ నుండి వస్తున్నా ముప్పును నిస్సందేహంగా అడ్డు కట్టపడింది. ఇప్పటికే ‘కోటి‘ మంది పైగా? అక్రమంగా వలస వచ్చిన వారు బంగ్లా దేశ్ కు తిరిగి వెళుతున్న తీరు అందరిని ‘ముక్కున వేలు‘ వేసుకునేలా చేసింది. పశ్చిమ బెంగాల్ ను అనుకోని ఉన్న 5 రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఇది దేశ భద్రత కు మరో మంచి పరిణామం. ఇదిలా ఉండగా ‘నిజం నిష్ఠురమైన’ దక్షిణాదికి అన్నాయం జరుగుతుంది. ఉత్తరాదికి అభివృద్ధి నిధులు తాయిలాలు వెల్లువ, దక్షిణాది నుండి ‘పన్నుల రాబడి’ దేశం అంతటికి పంచడం ‘కాంగ్రెస్’ హయం నుండి ప్రస్తుత ‘బీజేపీ’ పాలన వరకు కొనసాగుతూనే ఉంది. అందుకే దక్షిణాది ప్రజలు కూడా వాస్తవం కనిపెట్టేసారు.. మంచి ప్రజా తీర్పు లు ఇస్తున్నారు. దక్షిణాదిన పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం మినహాయిస్తే 5 కీలక రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో కర్ణాటక, తెలంగాణ, కేరళం కాంగ్రెస్ పార్టీ పూర్తీ అధికారంలో ఉండగా ఇటీవల జరిగిన తమినాడు ఎన్నికలలో విజయ్ పార్టీ కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చి అధికారం పంచుకోవడంలతో కాంగ్రెస్ ఏకంగా 4 రాష్టాలలో తన సత్తా చూపింది. ఇక ఎన్డీయే కి మిగిలింది కేవలం ఏపీ మాత్రమే..రాజకీయాలు అంతుపట్టవు..అకస్మాత్తు గా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కాంగ్రెస్ ఆద్వర్యంలోని ఇండియా కూటమి లో చేరితే? ఇక దక్షిణాది భారతంతో తో బీజేపీకి పెద్ద పని ఉండదు.. ఇది కఠోర వాస్తవం..అందుకే అసలు వాస్తవం తాజాగా బీజేపీ పెద్దలకు అర్ధం అయ్యింది. ఇప్పటికైనా దక్షిణాది ప్రజలు మనస్సు గెలుచుకొనే అభివృద్ధి పనులు చేపట్టాలి. అందుకే హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన లో అక్కడ ఉన్న జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసాలకు ప్రోటో కాల్ ప్రక్కన పెట్టి, ప్రధాని మోదీ స్వయంగా వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అందుకే ఆఖరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని మోడీ వేదికపైనే ‘నాతో జోడి కట్టు‘ గుజరాత్ లా తెలంగాణ ను అభివృద్ధి చెయ్యవచ్చు అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఎన్డీయే రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమయ్యాయి...సిగ్మా ప్రసాద్ కాలమ్స్.
