సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సామాజిక సేవా రంగాలలో బోండా రాంబాబు చేస్తున్న విశేష కృషి అద్వితీయమని, ఎంతో ప్రతిష్ఠాత్మకమైన దాసరి సేవా రత్న అవార్డు అందుకోవడం అభినందనీయమని డిఎన్నార్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండు రంగరాజు అన్నారు. ఇటీవలే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో దాసరి లెజండరీ ఫిల్మ్ అవార్డు -26 ప్రదానోత్సవంలో దాసరి సేవారత్న అవార్డు అందుకున్న మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ & కన్వీనర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు బొండా రామకృష్ణారావు (రాంబాబు) ను భీమవరం బొండాడ విడిది ఇల్లులో జరిగిన కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో .తాడిమళ్ల గిరి, డాక్టర్ ఇర్రింకి సూర్యారావు,కారుమూరి సత్యనారాయణ, క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ ప్రొఫెసర్ సంజీవరావు పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, రాయప్రోలు భగవాన్, తటవర్తి బదరి, కురిశెట్టి నాని,తదితరులుతో పాటు లయన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్ , వివిధ సంఘాల ప్రతినిధులు, పాలుగొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *