సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఉప సభపతి రఘురామా కృష్ణంరాజు నేడు , సోమవారం మీడియా సమావేశంలో సంచలన వ్యాక్యలు చేసారు. ఆయన తాజా వ్యాఖ్యలు కేవలం ఏపీ మాత్రమే కాదు.. మొత్తం దేశం రాజకీయాలు తేనే తుట్టను మొత్తం కుదిపివేసే అవకాశాలు స్వష్టంగా ఉన్నాయి. మీడియా సమావేశంలో రఘురామా మాట్లాడుతూ.. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం ఇకపై క్రైస్తవ మతంలోకి చేరిన వారికీ ఎస్ సి కోటా వర్తించదని .. వారి వివరాలు తయారు చెయ్యవలసినదిగా ఆదేశించానని,.. దీనితో ఇకపై ఎన్నికలలో ఎస్ సి రిజెర్వేషన్ కోటాలో క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు అర్హులు కాదని, వారు ఓసి అభ్యర్థులు పోటీ చేసే ‘జనరల్ కోటా’లోనే ఎన్నికలలో పోటీ చెయ్యవలసింది అని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ప్రార్థనా స్థలాలలో లౌడ్ స్పీకర్ల కారణంగా ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు శబ్ద కాలుష్య నియంత్రణ మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారికి రాసిన లేఖ రాసినట్లు తెలిపారు. దీనిని అతిక్రమిస్తే చట్టప్రకారం లక్షలాది రూపాయలు జరిమానాతో పాటు 5 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందని ప్రకటించారు.
