సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు, మంగళవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు.. ఈ కొత్త విధానాన్ని అతి త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు. కొత్త వాహనదారులకు డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ అనంతరం 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్‌కు ఆమోదం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపారు. గడువులోపు సంబంధిత అధికారులు స్పందించకపోతే ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ ఆమోదం అయినట్లు పరిగణించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *