సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 2.4 శాతం పెరిగి 106.75 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రద్దు కావొచ్చని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో భారతీయ స్టొక్ మార్కెట్ వరుసగా 2వ రోజు కూడా నష్టాల బాట పట్టింది. ఐటీ సెక్టార్‌ 3 శాతానికి పైగా నష్టపోయింది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి 95.63 దారుణంగా పతనమైంది. గత సెషన్ ముగింపు (76,015)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ చివరకు 1456 పాయింట్ల భారీ నష్టంతో 74,559 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 436 పాయింట్ల నష్టంతో 23,379 వద్ద స్థిరపడింది (stock market ).బ్యాంక్ నిఫ్టీ 884 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1553 పాయింట్లు నష్టపోయింది. దేశంలో కూడా మరి కొద్దీ రోజులలో పెట్రోల్ డీజిల్ రేట్లు లీటర్ కు 5 రూపాయలు వరకు పెరగనున్నాయని లీక్స్ వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *