సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4 రోజుల భారీ నష్టాలకు కాస్త బ్రేక్ వేసి నిన్న గురువారం లాభాలు, సాధించిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతాన్ని(శుక్రవారం) స్వల్ప నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో ముగిశాయి. నేడు, శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యాయి.ఉదయం సెషన్లో సెన్సెక్స్ దాదాపు 350 పాయింట్ల లాభంతో 75,765 వరకు వెళ్ళినప్పటికీ, పదకొండు గంటల తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇక, ఐటీ రంగంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆటో రంగంలో మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిసి మార్కెట్‌కు కొంత మద్దతునిచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక దశలో 96.14 స్థాయికి పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 107 డాలర్లు దాటడం మదుపర్లను ఆందోళనకు గురిచేసింది.
