సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వయస్సు పెరిగే కొద్దీ మాస్ ఇమేజ్ పెంచుకొంటూ పోతున్న హీరో నందమూరి బాలయ్య. ఆయన అభిమానులకు జూన్ 10న చాలా స్పెషల్ డే. అదే ఆయన పుట్టిన రోజున ఆయన కొత్తగా నటిస్తున్న రెండు భారీ సినిమాల షూటింగ్ లు ఒకేసారి ప్రారంభం? కానున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ చేస్తున్న కొత్త సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరోవైపు, అగ్ర దర్శకుడు కొరటాల శివ తో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ నుంచి కూడా చిన్న స్పెషల్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగాబాలయ్య కు తొలిసారి అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌కు మరింత హైలైట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.వేచి చూద్దాం
