సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో నేటి ఉదయం భారీ నష్టాల్లో కొనసాగిన సూచీలు మధ్యాహ్నం తర్వాత మెల్లగా కోలుకున్నాయి. గల్ఫ్ లో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టే సూచనలు, వార్తల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలతో రోజును ముగించాయి. అయితే బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది. గత సెషన్ ముగింపు (75,237)తో పోల్చుకుంటే నేడు సోమవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు వెళ్లింది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ ఒక దశలో 1400 పాయింట్లు పైకి వచ్చింది. చివరకు సెన్సెక్స్ 77 పాయింట్ల స్వల్ప లాభంతో 75,315 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 6 పాయింట్ల లాభంతో 23,649 వద్ద స్థిరపడింది (stock market ). అయితే బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 93 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.35)గా ఉంది.
