సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోహిణికార్టి లో ఎండ వేడిమికి రోళ్ళు బ్రద్దలు అవుతాయని నానుడి.. నిజం చేస్తూ భానుడి భగభగలతో పచ్చని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రచండంగా మారింది. కొన్ని రోజులుగా జిల్లాలో తారస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద వుతుండడంతో ప్రజలు ఎండతీవ్రత తట్టుకోలేక పోతు న్నారు. నేడు బుధవారం రోహిణికార్టి సత్తా చూపెట్టింది. భీమవరం లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మధ్యాహ్నం వేడిమికి నిప్పులు చెరుగుతున్న తీరున వేడి హడలు పుట్టించింది. ఇక ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, భీమడోలు తదితర ప్రాంతాల్లో కూడా గత 3 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పైగా ఉంటుంది.. నేడు అక్కడ కూడా 45- 46 వరకు నమోదు అయ్యాయి.ఇక ప్రజలు ఎలా బ్రతుకుతారో? అన్న ఆందోళనరేకెత్తుతుంది. రాత్రి పూట ఉషో ్ణగ్రతలు 26 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు నమోదవుతుండడంతో ఉక్క బోత తప్పడం లేదు. ఎండల ధాటికి ప్రధాన పట్టణాల్లో రోడ్లు ఫై ప్రాణికోటి సంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆ మేరకు మండలాలవారీగా నమోదయ్యే ఉష్ణోగ్రతలు..దెందులూరు 46.1, ద్వారకా తిరుమల 45.3, కైకలూరు 45.4, కలిదిండి 45.4, కామవరపుకోట 45.3, కొయ్యలగూడెం 45.6, కుక్కునూరు 46.4,గా నమోదు అవుతున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *